ఈ 5 స్టాక్స్‌ను కవర్ చేసిన బ్రోకింగ్ సంస్థలు ! మీరూ ఓ లుక్కేయండి
దేశీయ బ్రోకింగ్ సంస్థలు ఐదు స్టాక్స్ పై తమ కవరేజీని ఇనీషియేట్ చేశాయి. అంటే కొత్తగా ఈ స్టాక్స్‌ను మరింత యాక్టివ్‌గా ట్రాక్ చేస్తాయి. వీటిల్లో కొన్ని తెలిసినవే అయినా యాక్టివిటీ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువే. ఈ జాబితాలో ప్రజ్ ఇండస్ట్రీస్, పూనావాలా ఫిన్ కార్ప్, అశోక్ లేల్యాండ్, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్, ఫేజ్ త్రీ స్టాక్స్ ఉన్నాయి. ఇంతకీ వీటిల్లో బయ్ రేటింగ్ దేనికి, సెల్ దేనికి, షార్ట్ టర్మ్ రికమెండేషన్ ఏదో చూద్దాం.
స్టాక్ – ప్రజ్ ఇండస్ట్రీస్
ప్రస్తుత ధర రూ.420
బ్రోకింగ్ సంస్థ – ప్రభుదాస్ లీలాధర్
బయ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్‌ను రూ.507గా చెబ్తున్నారు. 2024 ఎర్నింగ్స్‌తో పోలిస్తే 30 పీఈతో స్టాక్ ట్రేడ్ అవుతోంది. ఎథనాల్ ప్లాంట్స్ విభాగంలో దేశీయంగా పటిష్టమైన నాయకత్వ పాత్ర పోషించే స్థాయికి సంస్థ ఎదిగే ఆస్కారం ఉంది. దాదాపుగా 100 దేశాల్లో ప్రెజెన్స్ ఉంది.
స్టాక్ – బాలక్రిష్ణ ఇండస్ట్రీస్
ప్రస్తుత ధర రూ.2048
రికమెండ్ చేసిన బ్రోకింగ్ సంస్థ – హెచ్ డి ఎఫ్ సి రీసెర్చ్
హెచ్ డి ఎఫ్ సి బ్రోకింగ్ సంస్థ ఈ స్టాక్‌పై కవరేజీ మొదలుపెట్టింది. టార్గెట్‌ను రూ.2093కి తగ్గించింది. 2024 ఎర్నింగ్స్‌తో పోలిస్తే స్టాక్ 23 రెట్ల పీఈతో ట్రేడవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ కాస్త ఖరీదైనదిగా కనిపిస్తోంది.
బాలక్రిష్ణ మార్జిన్లు ఈ మధ్యకాలంలో బాగా తగ్గి 20 శాతానికి పరిమితమయ్యాయి. యూఎస్, యూరోప్ దేశాల్లో వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఈ కంపెనీపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. త్వరలో మార్జిన్లు క్రమంగా పెరిగి 27 శాతానికి చేరొచ్చని అంచనా కడ్తోంది హెచ్ డి ఎఫ్ సి సెక్యూరిటీస్.
స్టాక్ – పూనావాలా ఫిన్ కార్ప్
ప్రస్తుత ధర రూ.307
రికమెండ్ చేసిన బ్రోకింగ్ సంస్థ – జెఎం ఫైనాన్స్
జెఎం ఫైనాన్స్ సంస్థ.. పూనావాలా ఫిన్ కార్ప్ స్టాక్‌ను రికమెండ్ చేస్తూ బయ్ రేటింగ్ ఇచ్చింది. ఈ స్టాక్‌కు రూ.400 టార్గెట్ ప్రైస్‌గా చెబ్తోంది. గతంలో మాగ్మా ఫిన్ కార్ప్‌గా ఉన్న ఈ సంస్థ పేరుమారిన సంగతి మనకు తెలిసిందే. పూనావాలా గ్రూప్ ప్రమోటర్ ఈ కంపెనీలో 62 శాతం వాటా కొనుగోలు చేశారు. తక్కువ ఖర్చులో రుణాలు, నిధులు తెచ్చుకునేందుకు ప్రమోటర్ గ్రూప్ ప్రయత్నాలు చేయడం ప్రస్తావించాల్సిన అంశం. హై క్వాలిటీ కస్టమర్ బేస్ బట్టి చూస్తే… దీర్ఘకాలంలో ఈ స్టాక్ బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉందని జెఎం ఫైనాన్స్ భావిస్తోంది.
స్టాక్ – అశోక్ లేల్యాండ్
ప్రస్తుత ధర రూ.154
రికమెండ్ చేసిన బ్రోకింగ్ సంస్థ – బిపి వెల్త్ ఎయిడ్
కమర్షియల్ వెహికల్స్‌లో ఎప్పటినుంచో లీడర్షిప్ స్టేజీలో ఉన్న ఈ సంస్థ, MHCV విభాగంలో 27 శాతం మార్కెట్ షేర్‌ను సాధించింది. అయితే ఓవరాల్‌గా కమర్షియల్ ఇండస్ట్రీలో 16 శాతం మార్కెట్ వాటాను ఈ సంస్థ కలిగి ఉంది. బస్సులు, ట్రక్కులు, ఇంజిన్స్, డిఫెన్స్, స్పెషల్ వెహికల్స్ వంటి డిఫరెంట్ పోర్ట్‌ఫోలియో ఉండడం ఈ సంస్థకు కలిసొచ్చే అంశం.
ఎంహెచ్ సివి విభాగంపై తన దృష్టిని తగ్గించుకుంటూ వచ్చిన సంస్థ, ఇప్పుడు ఎల్ సి విలపై ఫోకస్ పెట్టింది. బస్ సెగ్మెంట్ కూడా రాబోయే రెండు, మూడేళ్లలో మంచి వృద్ధిని కనబర్చే అవకాశం ఉందని బ్రోకింగ్ సంస్థ అంచనా కడ్తోంది.
స్టాక్ – ఫేజ్ త్రీ (Faze Three)
ప్రస్తుత ధర రూ.377
రికమెండ్ చేసిన బ్రోకింగ్ సంస్థ – హెచ్ డి ఎఫ్ సి సెక్యూరిటీస్
రాబోయే రెండు, మూడు క్వార్టర్ల వ్యూతో ఈ స్టాక్ సూచించింది హెచ్ డి ఎఫ్ సి సెక్యూరిటీస్. ఇన్వెస్టర్లు రూ.393-405 మధ్య స్టాక్‌ను కొనుగోలు చేయడంతో పాటు కరెక్షన్స్లో రూ.350 వరకూ బయ్ చేయొచ్చు. బేస్ టార్గెట్ రూ.437, బులిష్ టార్గెట్ రూ.466 వరకూ ఉంది.
ప్రస్తుతం కంపెనీ పీక్ కెపాసిటీ సామర్థ్యంతో నడుస్తోంది. 2018 నుంచి జీరో లాంగ్ టర్మ్ డెట్‌లో ఉంది. అంటే ఎలాంటి రుణభారం లేదు. అయితే ఈ మధ్యే రామెటీరియల్ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టేషన్ భారం పెరగడంతో కొద్దిగా షార్ట్ టర్మ్ డెట్ పెరిగింది. అది కూడా కెపాసిటీ విస్తరణలో భాగంగానే.
నోట్ – ఇవి కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ రిస్క్ ప్రొఫైల్ అంచనా వేసుకోండి.