Message: Return type of CI_Session_files_driver::open($save_path, $name) should either be compatible with SessionHandlerInterface::open(string $path, string $name): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::close() should either be compatible with SessionHandlerInterface::close(): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::read($session_id) should either be compatible with SessionHandlerInterface::read(string $id): string|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::write($session_id, $session_data) should either be compatible with SessionHandlerInterface::write(string $id, string $data): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::destroy($session_id) should either be compatible with SessionHandlerInterface::destroy(string $id): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::gc($maxlifetime) should either be compatible with SessionHandlerInterface::gc(int $max_lifetime): int|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
అనావృష్టిలోనూ మెరుగైన పంట దిగుబడినిచ్చే బయోఫ్యాక్టర్ 'బెలోమ్'
మరింత సమర్థవంతంగా బయోఫ్యాక్టర్ "బెలోమ్"
- ఆధునీకరించిన ఏంఏఎంఎస్ టెక్నాలజీతో అద్భుత ఫలితాలు
- అనావృష్టిలోనూ మెరుగైన పంట దిగుబడి
- ప్రపంచ మార్కెట్కు ఫోలియర్ న్యూట్రిమేషన్ ‘బెలోమ్’ సిరీస్
హైదరాబాద్, నవంబర్ 20: జీవన ఎరువులు, ప్రాణాధార పోషకాల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయోఫ్యాక్టర్ పరిశోధనలో మరో ముందడుగు పడింది. అనావృష్టి, అతివృష్టిలోనూ మెరుగైన పంట దిగుబడి కోసం అత్యంత సమర్థవంతంగా పనిచేసే "బెలోమ్" ఫోలియర్ న్యూట్రిమేషన్ సాంకేతికతకు మరింత సామర్థ్యాన్ని జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా మెటబోలైట్ అసిస్టెడ్ మైక్రాన్ సైజ్డ్ (ఏంఏఎంఎస్) న్యూట్రిమేషన్ తయారు చేసి బయోఫ్యాక్టర్ ఇప్పటికే విజయవంతంగా విక్రయిస్తోంది. ఆధునీకరించిన బెలోమ్ ఉత్పాదనపై దేశవ్యాప్తంగా సాగించిన పరిశోధనలలో అద్భుత ఫలితాలు వచ్చాయని బయోఫ్యాక్టర్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న బయోఫ్యాక్ ఇన్పుట్స్ ఫౌండర్, సీఈవో ఎల్ఎన్ రెడ్డి వెల్లడించారు. మొక్కకు కావలసిన 13 రకాలైన ప్రాణాధార పోషకాలు ఏంఏఎంఎస్ విధానంలో ప్రత్యేకించి తయారు చేశామని తెలిపారు.
విదేశాలకు ఎగుమతి..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆధునీకరించిన ‘బెలోమ్’ సిరీస్ ఉత్పాదనలను చేరవేరుస్తామని ఎల్ఎన్ రెడ్డి చెప్పారు. ‘అన్ని రకాల పంటలకు ఈ ఉత్పాదనను వినియోగించవచ్చు. వర్షాధార ప్రాంతంలో సాగయ్యే వాణిజ్య పంటలకు సైతం అద్భుతంగా దిగుబడి వచ్చింది. తక్కువ ఖర్చుతో సాగు చేయవచ్చు. దిగుబడి 20-30 శాతం పెరిగిందని పరిశోధనలో నిరూపితమైంది. తెగుళ్లు, వ్యాధుల నుంచి తట్టుకోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. బయోఫ్యాక్టర్ పరిశోధన, అభివృద్ధి విభాగం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసర్చ్కు (డీఎస్ఐఆర్) నుంచి ధ్రువీకరణ ఉంది. కంపెనీ చేపట్టే పరిశోధనలకు డీఎస్ఐఆర్ నుంచి అనుమతి ఉంది’ అని ఎల్ఎన్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా..
ఫోలియర్ న్యూట్రిమేషన్ టెక్నాలజీతో బయోఫ్యాక్టర్ తయారు చేసిన ‘బెలోమ్’ ఉత్పాదనను ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షకు పైచిలుకు రైతులు వినియోగిస్తున్నారని ఎల్ఎన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, టమాట, వంకాయలు, బంతి, మిర్చి, పత్తి వంటి పంటలపై పరిశోధనలు జరిపామని చెప్పారు. నానో జింక్ సస్పెన్షన్ ప్రొడక్షన్ టెక్నాలజీని వాణిజ్యీకరించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్కు (ఐసీఏఆర్) చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీతో బయోఫ్యాక్టర్కు అవగాహన ఒప్పందం, పరిశోధనా భాగస్వామ్యం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా 2014లో బయోఫ్యాక్టర్ ఏర్పాటైంది. 650 మంది ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా 3,500 పైచిలుకు డీలర్ నెట్వర్క్ ఉంది. ప్రోబయాటిక్స్ విభాగంలో 35 ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్తోపాటు నానో టెక్నాలజీలో ఎనిమిది పేటెంట్లను సొంతం చేసుకుంది.