Message: Return type of CI_Session_files_driver::open($save_path, $name) should either be compatible with SessionHandlerInterface::open(string $path, string $name): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::close() should either be compatible with SessionHandlerInterface::close(): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::read($session_id) should either be compatible with SessionHandlerInterface::read(string $id): string|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::write($session_id, $session_data) should either be compatible with SessionHandlerInterface::write(string $id, string $data): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::destroy($session_id) should either be compatible with SessionHandlerInterface::destroy(string $id): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::gc($maxlifetime) should either be compatible with SessionHandlerInterface::gc(int $max_lifetime): int|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
అల్యూమినియం డోర్స్, విండోస్ కోసం దేశంలో తొలి Encore - Alcom రోబోటిక్ ప్లాంట్
ఎన్కోర్-ఆల్కమ్ అత్యాధునిక ప్లాంట్, భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ
రూ.60 కోట్లతో సూరత్‌లో ఏర్పాటు, అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ
హైదరాబాద్‌లో ఫ్యాబ్రికేషన్ యూనిట్
హైదరాబాద్: అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఎన్కోర్-ఆల్కమ్ గుజరాత్‌లోని సూరత్ వద్ద 1,80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ప్లాంటు నెలకొల్పుతోంది. ఈ ప్లాంటు కోసం కంపెనీ సుమారు రూ.60 కోట్లు వెచ్చిస్తోంది. అల్యూమినియం డోర్స్, విండోస్ విభాగంలో భారత్‌లో తొలి ఆటో రోబోటిక్ ఫెసిలిటీ ఇదేనని సంస్థ వెల్లడించింది. విస్తీర్ణం పరంగా దేశంలో అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుందని ఎన్కోర్-ఆల్కమ్ ఫౌండర్, సీఎండీ అవుతు శివ కోటి రెడ్డి తెలిపారు. జర్మనీ సాంకేతికతతో రోజుకు 30,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యంతో మార్చికల్లా ఈ కేంద్రం సిద్ధం అవుతుందని చెప్పారు.
ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు..
"కొత్త ప్లాంటుతో 180 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పటికే సూరత్‌లో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 10,000 చదరపు అడుగుల తయారీ సామర్థ్యం గల ప్లాంటు ఉంది. పోటీ కంపెనీలతో పోలిస్తే మా ఉత్పత్తులు 300 శాతం మెరుగ్గా ఉంటాయి. కస్టమర్ కోరుకున్నట్టు ఆర్కిటెక్చరల్ ఉత్పాదనలు మా ప్రత్యేకత. 60 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి " అని శివ కోటి రెడ్డి చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జనవరి 19 నుంచి జరిగే ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్‌లో వినూత్న ఉత్తత్తులను ప్రదర్శిస్తామని ఆల్కమ్ డైరెక్టర్ జయంతి భాయ్ మనుభాయ్ తెలిపారు.
ఫ్యాబ్రికేషన్ యూనిట్..
కంపెనీ హైదరాబాద్ సమీపంలోని మోకిల వద్ద 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఫ్యాబ్రికేషన్ యూనిట్ మార్చికల్లా ప్రారంభం కానుంది. ఇక్కడే 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ రానుంది. ఫ్యాబ్రికేషన్ యూనిట్‌కై 180 మందిని నియమించుకోనున్నారు. ఎన్కోర్ ఇప్పటికే వుడ్ డోర్స్ తయారీలో ఉంది. దక్షిణాదిన ఎన్కోర్ బ్రాండ్‌లో, ఉత్తరాదిన ఆల్కమ్ బ్రాండ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నామని శివ కోటి రెడ్డి తెలిపారు. ‘ఆల్కమ్ ఎనమిదేళ్ల క్రితమే సూరత్‌లో అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీ ప్లాంటు ప్రారంభించింది. 450 మంది సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు ప్లాంటులో 300 మంది పనిచేస్తున్నారు. సూరత్ కొత్త ప్లాంటు అందుబాటులోకి వస్తే ఎన్కోర్ బ్రాండ్ అల్యూమినియం డోర్స్, విండోస్‌ను దక్షిణాదిన పరిచయం చేస్తాం’ అని వెల్లడించారు.
ఏస్టెక్లో స్టాల్..
జనవరి 19 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఏస్‌టెక్ ట్రేడ్ ఫెయిర్ జరుగనుంది. 1.8 టన్నుల బరువున్న 18 అడుగుల ఎత్తైన విండోను ఎన్కోర్ ప్రదర్శించనుంది. కంపెనీ తయారు చేస్తున్న విభిన్న, వినూత్న ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరనున్నాయి.