Message: Return type of CI_Session_files_driver::open($save_path, $name) should either be compatible with SessionHandlerInterface::open(string $path, string $name): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::close() should either be compatible with SessionHandlerInterface::close(): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::read($session_id) should either be compatible with SessionHandlerInterface::read(string $id): string|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::write($session_id, $session_data) should either be compatible with SessionHandlerInterface::write(string $id, string $data): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::destroy($session_id) should either be compatible with SessionHandlerInterface::destroy(string $id): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
Message: Return type of CI_Session_files_driver::gc($maxlifetime) should either be compatible with SessionHandlerInterface::gc(int $max_lifetime): int|false, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice
మొబైల్స్ రిటైల్‌లో కొత్త రూపం తెచ్చాం
రెండేళ్లలో ఔట్లెట్ల సంఖ్యను 400లకు చేరుస్తాం
2023–24లో రూ.1,500 కోట్ల టర్నోవర్ లక్ష్యం
బిగ్–సి ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి
రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న కంపెనీ
హైదరాబాద్, ఆగస్ట్ 20: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్–సి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2022–23లో కంపెనీ రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బిగ్–సి ఖాతాలో 250 ఔట్లెట్లు ఉన్నాయి. రెండేళ్లలో వీటి సంఖ్యను 400లకు చేరుస్తామని బిగ్–సి ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇందుకు రూ .300 కోట్ల వరకు పెట్టుబడి చేస్తామని చెప్పారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబుతో కలిసి సామ్సంగ్ నూతనంగా తయారు చేసిన ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లను ఆవిష్కరించిన అనంతరం బిగ్–సి ఈడీ స్వప్న కుమార్, డైరెక్టర్లు బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి, కైలాష్ తో కలిసి ఆదివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2002 డిసెంబర్ 23న బిగ్–సి ప్రారంభం అయింది. మొబైల్స్ రిటైల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో నిలిచి రెండు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. మూడవ దశాబ్దంలోనూ అగ్ర స్థానాన్ని కొనసాగిస్తాం. 3 కోట్ల మంది వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 2,500 నుంచి రెండేళ్లలో 4,000లకు చేరుతుంది’ అని చెప్పారు.
వ్యవస్థీకృతం చేశాం..
దేశంలో మొబైల్స్ రిటైల్‌ను వ్యవస్థీకృతం (ఆర్గనైజ్డ్) చేసిన ఘనత తమదేనని బాలు చౌదరి చెప్పారు. ‘2006 నుంచి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటున్నాం. ఒక రిటైల్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవడం భారత్‌లో అదే తొలిసారి. అలాగే మొబైల్స్‌ను డిస్ప్లే చేయడం మాతోనే ప్రారంభం అయింది. టచ్ అండ్ ఫీల్‌ను సుసాధ్యం చేశాం. కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు కస్టమర్ల ముందు ఉంచుతున్నాం. వినియోగదార్ల నమ్మకం, నాణ్యమైన సేవలు, ఉత్పత్తులు, మెరుగైన అనుభూతికితోడు 2,500 మంది ఉద్యోగుల అకుంఠిత దీక్ష కారణంగానే అగ్రస్థాయిలో నిలిచాం. మొబైల్స్ ఉన్నంత కాలం బిగ్–సి ప్రయాణం కొనసాగుతుంది. ఒక్కో కుటుంబంలో మూడు తరాలకు సేవలు అందిస్తున్నాం’ అని వివరించారు.
రెండు గంటల్లో డెలివరీ..
టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మొబైల్స్ తయారీ సంస్థలతో కలిసి కస్టమర్లకు ఆధునిక మోడళ్లను అందిస్తున్నామని బాలు చౌదరి తెలిపారు. రాబోయే రోజుల్లో 5జీ కొత్త రికార్డులు నమోదు చేయనుందన్నారు. ‘కరోనా మహమ్మారి తర్వాత మొబైల్స్ రిటైల్‌లో కన్సాలిడేషన్ జరిగింది. ఆఫ్‌లైన్ వాటా ఏకంగా 65 శాతానికి చేరింది. ఆన్లైన్ ప్రభావం బిగ్–సి పైన లేదు. బిగ్–సి స్టోర్‌లో కొంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో కస్టమర్‌కు అవగాహన ఉంది. బిగ్–సి పోర్టల్‌లో మొబైల్ కొనుగోలు చేస్తే 2 గంటల్లో డెలివరీ ఇస్తున్నాం. బిగ్–సి కేంద్రాల్లో టీవీల విక్రయాలూ పుంజుకున్నాయి’ అని చెప్పారు.