100 Days Mentorship Classes – Batch 38

April 2025 – Batch
ONLINE Classes from April 07th
Registrations already started

If You Want To Become a TRADER just because –
✓ You Need Money Quickly – ✓ Hate Your Current Job
✓ Everyone Trading in Your Circle – ✓ Impressed With Big Profit Screenshots
NO ONE WILL SAVE YOU

1st Step Keep Learning
2nd Step Keep Learning and follow the trade plan with discipline, You will make money in the market.
ముందు నుంచి ఒకే మాటే చెబ్తూ వస్తోంది ప్రాఫిట్ మాస్టర్ టీమ్. ముందు నేర్చుకోండి.. ఆ తర్వాతే సంపాదనపై దృష్టిపెట్టండి.

ప్రాఫిట్ మాస్టర్ టీమ్ ఎనలిస్టులు తమ విలువైన సమయాన్ని వెచ్చించి అద్భుతమైన మెంటార్షిప్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో వంద రోజుల పాటు ట్రేడింగ్ మెళకువలను తెలుసుకునే వెసులుబాటు మీకు కలుగుతుంది. అయితే ఇందులో చేరిపోగానే మీరు లక్షలకు లక్షలు గడించేస్తారని మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ చెప్పబోము. ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఒక బిజినెస్ లా చూడాలి, ఏం నేర్చుకోవాలి అనే బేసిక్స్‌తో పాటు ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు ఓ ప్రొఫెషనల్ అనేవాడు ఎలా ట్రేడ్ చేస్తారు? రేపటి కోసం ఎలాంటి ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు? మార్కెట్ పడ్తే ఏం చేస్తాడు? పెరిగితే ఏం చేస్తాడు ? అక్కడక్కడే ఉంటే ఏం చేస్తాడు వంటివన్నీ తెలుసుకుంటారు.

బ్రేకవుట్ ట్రేడ్స్, మొమెంటం స్టాక్స్, ప్రతీ రోజూ నిఫ్టీలో 20 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో 100 పాయింట్స్ ప్రాఫిట్ స్ట్రాటజీ వంటి వన్నీ మెల్లిమెల్లిగా (Key Level Based trading) తెలుసుకోండి. మార్కెట్ గురించి ఏ మాత్రం అవగాహన లేని ఫ్రెషర్స్ దగ్గరి నుంచి, కొద్దో గొప్పో ట్రేడ్ చేస్తున్న వాళ్ల వరకూ అందరికీ ఇది ఉపయోగపడ్తుంది. ముఖ్యంగా ఎంప్లాయీస్, హౌజ్ వైఫ్స్, Students సహా స్టాక్ మార్కెట్ ద్వారా రెండో ఆదాయం కోసం చూసే వాళ్లందరికీ ఇది ఉపయుక్తం.

ట్రేడింగ్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఇది సింపుల్ కానీ, ఈజీ మాత్రం కాదు. ఏదో ఉందని భయపడకుండా అసలు ఏముందో తెలుసుకుంటే సులువైపోతుంది. అందుకే ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు ఈ క్లాసుల ద్వారా ట్రేడింగ్‌ సులువుగా నేర్చుకుని లబ్ధిని పొందుతున్నారు. ఎక్కడైనా పదిక్లాసులు, ఇరవై క్లాసులో చెప్పి ఇక అక్కడితో దులిపేసుకుంటారు. కానీ ప్రాఫిట్ మాస్టర్ దగ్గర మాత్రం అలా కాదు. మీ క్లాసులు పూర్తైన తర్వాత సుమారు నాలుగు నెలల పాటు మెంటార్షిప్ మీకు లభిస్తుంది.

మెంటార్‌షిప్ అంటే ? Mentorship Means
మీ సబ్జెక్ట్ క్లాసులు అన్నీ పూర్తైన తర్వాత వంద రోజుల పాటు మెంటార్షిప్ ఉంటుంది. ఈ మెంటార్‌షిప్‌లో మీకు ట్రేడింగ్ గురించి కానీ, సబ్జెక్ట్ గురించి కానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎనలిస్టులను అడిగి తెలుసుకోవచ్చు. వాళ్లను వాట్సాప్ ద్వారానో, అపాయింట్‌మెంట్ తీసుకుని ఫోన్ ద్వారా అయినా సంప్రదించి మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా నేర్చుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ట్రేడింగ్ పొజిషన్లు తీసుకోవడం, స్టాక్ ఎంపిక, రేపటి ట్రేడ్ ప్లాన్.. ఇలా మీకు సబ్జెక్ట్ గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎనలిస్టులు సందేహాలు తీరుస్తారు. సబ్జెక్ట్ పై మీకు కాన్పిఢెన్స్ వచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. మన ప్రీ ప్లాన్డ్ సెషన్స్ అన్నీ ముగిసిన తర్వాత వారంలో ఒక రోజు (Mostly Friday – ఏదైనా మార్పు ఉండే ముందే వాట్సాప్‌లో సమాచారం అందుతుంది) అన్ని బ్యాచులకూ కలిపి డ్యూరింగ్ ది మార్కెట్ లైవ్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. అందులో మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడంతో పాటు మీ పొజిషన్స్, మీ ట్రేడ్‌ ఐడెంటిఫికేషన్స్‌ సహా సబ్జెక్ట్ సంబంధించి ఏ సందేహాలున్నా తీర్చుకోవచ్చు.

మీరేం చేయాలి ?
టెక్నికల్ ఎనాలిసిస్ అనేది ఓ నిరంతర అభ్యాస ప్రక్రియ. అంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త అంశమే. అందుకే మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రోజూ కనీసం గంటసేపైనా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో చేరిన వాళ్లకు ఎప్పటికప్పుడు హోం వర్క్ కూడా ఇస్తారు. దాన్ని పూర్తి చేసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తే.. ఎనలిస్టులు ప్రతీ ఒక్క ఛార్ట్‌నూ ఎనలైజ్ చేసి తప్పొప్పులు చెబ్తారు. పదిహేను క్లాసులు, 100 రోజుల మెంటార్షిప్‌ను మనం ఎంత అద్భుతంగా వినియోగించుకుంటే మనకు ట్రేడ్ పై అంత కాన్ఫిడెన్స్ వస్తుంది.

ఇక్కడ మీకు ఏమేం నేర్పిస్తారు, మీరేం నేర్చుకోవాలి?
స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అనే ప్రాధమిక అంశాలు మొదలు అసలు ఆర్డర్స్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఆర్డర్స్, ఫ్యూచర్స్ – ఆప్షన్స్ ట్రేడ్ చేసేప్పుడు ఆర్డర్స్ పెట్టే విధానం, ఛార్ట్స్ రీడింగ్, క్యాండిల్ స్టిక్స్ గుర్తింపు, బులిష్ స్టాక్స్, బేరిష్ స్టాక్స్ గుర్తింపు, మూవింగ్ యావరేజెస్, డిమాండ్ – సప్లై థియరీ నుంచి తర్వాతి ట్రేడింగ్ రోజుకు అవసరమయ్యే ట్రేడ్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి అనే అంశాల వరకూ అన్నీ నేర్చుకుంటారు.

క్లాసులు ఎన్ని రోజులు ?
మొత్తం 8 క్లాసుల థియరీ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత నాలుగు నెలల పాటు లైవ్‌ ట్రేడింగ్‌ సెషన్స్‌ (వారానికి ఒకటి) ఉంటుంది. ఈ లోపు ప్రతీ రోజూ మార్కెట్‌ అప్డేట్స్‌ సహా వివిధ ముఖ్యమైన అంశాలు మీకు గ్రూప్‌లో మెంటార్‌ పంపిస్తూనే ఉంటారు.

క్లాసులు ఎక్కడ జరుగుతాయ్ ? Online Classes
ఇవి పూర్తిగా ఆన్ లైన్ క్లాసులు. సిస్కో వెబెక్స్ ద్వారా ఈ క్లాసులు జరుగుతాయి. మీకు క్లాసులకు సంబంధించిన లింకును పంపించడం జరుగుతుంది. మొబైల్‌లో లేదా ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లో కూడా చూసుకోవచ్చు. అయితే డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లో ఛార్ట్స్ చూడడం వీలుగా ఉంటుంది.

థియరీ క్లాసెస్ వారంలో మూడు రోజులు ఉంటాయి. (సోమవారం, బుధవారం, శుక్రవారం)
ఈ క్లాసెస్ తర్వాత ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ ట్రేడింగ్ సెషన్స్, ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి.
ఈ లోపు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్, ఫోన్ కాల్ ద్వారా నివృతి చేసుకోవచ్చు.

Class Timings: Evening – 7 pm to 9 pm

Classes Date Time
Class 1 – 7:00PM to 9:00 PM Stock Market Basics, Charts, Candle Stick Basics

Class 2 – 7:00PM to 9:00 PM Market Technicals, Zones, Trends

Class 3 – 7:00PM to 9:00 PM Gap Analysis, Trading Styles

Class 4 – 7:00PM to 9:00 PM Volatility, Technical Indicators

Class 5 – 7:00PM to 9:00 PM Pivots, Technical Indicators

Class 6 – 7:00PM to 9:00 PM MTA, Money & Risk Managemnt

Class 7 – 7:00PM to 9:00 PM F & O Basics

Class 8 – 7:00PM to 9:00 PM F & O Basics

After these 8 theory classes live classes will be there to learn the subject practically with mentor guidance.

Live market classes ( 2pm to 3:30pm .). Every Friday Details will be shared in this groups whatsapp.

రికార్డింగ్ సౌలభ్యం
ఇతర ఫిజికల్ క్లాసుల్లో అయితే ఒక్కసారి వింటే అయిపోతుంది. కానీ ఆ ఆన్ లైన్ క్లాసుల్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే.. అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా వీటిని మనం చూసుకునే వీలుంటుంది. అలానే ఎనలిస్టులు మీకు మేసేజ్ దూరంలో మాత్రమే ఉంటారు.

ఈ ప్రోగ్రాంలో కవర్ అయ్యే అంశాలు :
Covered Topics
Very Basics of the Stock Market | How the stock market works |
How to place orders ? How to keep stop loss orders ?
Orders placing in Futures and Options
Difference between fundamental analysis and technical analysis

What is Technical Analysis? Why is it important
How to Read Stock Charts?

Different types of Candlestick Patterns
Different Indicators and How to Use It?

Momentum Indicators to Analyze Trends
Trends strength, Entries, and Exits.
Analyzing markets through Price, Volume, Momentum, Volatility and Time

Identification of Trend direction early
Identify best entries and exits

Basics of Options and Some trade Strategies

Journaling your trades and periodic reviewing to access your strengths and weakness

మెంటర్
M Rajendra Prasad (RP)

ఎం. రాజేంద్ర ప్రసాద్ (RP)
ఎం. కాం పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్, 1990 నుంచి స్టాక్ మార్కెట్లలో ఉన్నారు. మార్కెట్లపై ఉన్న ఆసక్తితో పాతికేళ్ల క్రితమే ముంబై సహా వివిధ ప్రాంతాలకు వెళ్లి అప్పట్లోనే ట్రైనింగ్ తీసుకుని టెక్నికల్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రేడింగ్ ట్రెండ్స్‌ను తెలుసుకున్నారు. ఆ తర్వాత తన కెరీర్‌లో హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఫ్లోర్ ట్రేడర్‌గా మొదలుపెట్టారు. అప్పటి నుంచి స్వంతంగా ట్రేడ్ చేస్తూ.. ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో రాజేంద్ర ప్రసాద్‌కు సుమారు 850మంది వరకూ శిష్యులు ఉన్నారు. 15 ఏళ్ల నుంచి ట్రైనింగ్ క్లాసెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతో మందిని ట్రేడర్లుగా తీర్చిదిద్దారు. కేవలం ట్రైనింగ్ కాకుండా ట్రేడింగ్ కూడా చేయడం వల్ల ఫుల్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఈయన సొంతం.
సరళమైన తెలుగులో, చక్కగా అర్థమయ్యే విధంగా క్లాసులను విడమర్చి చెప్పడంలో మంచి అనుభవం ఈయనకు ఉంది. వివిధ ఎకాడమీల్లో విద్యార్థులు, అధికారులకు మార్కెట్లపై ఎన్నో సెషన్లను ఈయన నిర్వహించారు.

పేమెంట్ ఎలా ?
Google Pay 93910 02840 (GPay) or 77029 06749 (Phonepe)
పేమెంట్ చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఈ నెంబర్ నుంచే మీకు వాట్సాప్ గ్రూప్ జాయినింగ్ లింక్ వస్తుంది.