100 Days Mentorship – Batch40

100 Days Mentorship Program
JUNE 2025 Batch (40th Batch)
Learn market from Basics to Advanced
Trade and Invest like a Professional
Classes from 12th June 2025
Join The Most Successful program of Profit Master, running for the past 4+ years

మనం మార్కెట్లలో అయినా నిజ జీవితంలో అయినా నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయితేనే మనుగడ ఉంటుంది. మనం వాడే ఫోన్ అయినా కంప్యూటర్ సిస్టమ్ అయినా నిత్యం అప్డేట్స్ కోసం అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి అవసరాలకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోకపోతే మరుగునపడిపోతాం, వెనుకబడిపోతాం. అలాంటి డబ్బులతో చెలగాటం ఆడేటప్పుడు ఇంకెంత చురుకుగా ఉండాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా డిగ్రీ, పీజీ తర్వాత చాలా మంది చదువుకోవడం ఆపేస్తారు. అక్కడే మనం దాదాపుగా ఆగిపోతాం. అయితే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్లకు మాత్రం అలా కుదరదు. ఎందుకంటే ఇది మోస్ట్ డైనమిక్. ఎప్పటికప్పుడు మనల్ని సిద్ధంగా ఉంచుకోకపోతే చాలా కష్టపడ్తాం, డబ్బులు పోగొట్టుకుంటాం. చివరకు మార్కెట్లను తిట్టుకుని, ఆత్మసంతృప్తి పొందుతాం.

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఓ ఫ్యాషనబుల్ వర్డ్ అయిపోయింది. అయితే చాలా మంది ఇందులో నష్టపోయి, మార్కెట్లను తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోయేవారే కానీ, తప్పు ఎక్కడుందో – ఎక్కడ-ఎందుకు జరిగిందో ఆత్మపరిశీలన చేసుకునే వాళ్ల సంఖ్య బాగా తక్కువ. ఎప్పుడైతే ఇంట్రాస్పెక్షన్ (ఆత్మపరిశీలన) ఉంటుందో అప్పుడే మరొకసారి ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడ్తాం. స్టాక్ మార్కెట్లో కూడా అంతే. తప్పులు చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఇంకోసారి ఆ తప్పు చేయకుండా పక్కా ప్లాన్ రాసుకుంటాం. అలాంటి పక్కా ప్లానింగ్, ట్రేడింగ్ వ్యూహాలు నేర్చుకుంటూ మనం మార్కెట్లో పెట్టే ప్రతీ పైసాను ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా పొదిమి కాపాడుకుంటూ, లాభాలు తెచ్చుకునేలా వ్యూహాలను నేర్పిస్తుంది ప్రాఫిట్ మాస్టర్ టీమ్. ఎనలిస్ట్ బృందం దశాబ్దాల అనుభవాన్ని రంగరించి, ఒక అద్భుత మెంటార్షిప్ ప్రోగ్రామ్‌ ను మీ అందరి కోసం అందిస్తోంది.

100 రోజుల పాటు ట్రేడింగ్ మెళకువలను తెలుసుకునే వెసులుబాటు ఈ ప్రోగ్రాం ద్వారా మీకు కలుగుతుంది. అయితే ఇందులో చేరిపోగానే మీరు లక్షలకు లక్షలు గడించేస్తారని మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ చెప్పబోము. ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఒక బిజినెస్‌లా చూడాలి, ఏమేం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి? అనే బేసిక్స్‌తో పాటు ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు ఓ ప్రొఫెషనల్ అనేవాడు ఎలా ట్రేడ్ చేస్తారు? రేపటి కోసం ఎలాంటి Trade Plan సిద్ధం చేసుకుంటాడు, మార్కెట్ పడినప్పుడు ఏం చేస్తాడు, పెరిగితే ఏం చేస్తాడు, అక్కడక్కడే ట్రేడ్ అవుతూ ఉంటే ఏం చేస్తాడు వంటివన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ చాలా చిన్నగా అనిపించినా, ఇందులో నేర్చుకునే కొద్దీ తెలియనంత డెప్త్ ఉంటుంది.

ట్రేడింగ్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఇది సింపుల్ కానీ, ఈజీ మాత్రం కాదు. ఏదో ఉందని భయపడకుండా అసలు ఏముందో తెలుసుకుంటే సులువైపోతుంది. అందుకే మూడేళ్లుగా విద్యార్థులు ఈ క్లాసులను సులువుగా నేర్చుకుని లబ్ధిని పొందుతున్నారు. ఎక్కడైనా పదిక్లాసులు, ఇరవై క్లాసులో చెప్పి ఇక అక్కడితో దులిపేసుకుంటారు. కానీ ప్రాఫిట్ మాస్టర్ దగ్గర మాత్రం అలా కాదు. మీ సెషన్ల క్లాసులు పూర్తైన తర్వాత సుమారు నాలుగు నెలల పాటు మెంటార్షిప్ మీకు లభిస్తుంది. ఆ తర్వాత కూడా మీకు ఆసక్తి ఉంటే, మెంటార్ ఎప్పుడూ ప్రోత్సహించేందుకు సిద్ధంగానే ఉంటారు.

మెంటార్‌షిప్ అంటే ? Mentorship Means
మీ Theory సబ్జెక్ట్ క్లాసులు అన్నీ పూర్తైన తర్వాత వంద రోజుల పాటు మెంటార్షిప్ ఉంటుంది. ఈ మెంటార్‌షిప్‌లో మీకు ట్రేడ్ ప్రాక్టీసెస్ సహా సబ్జెక్ట్ గురించి కానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎనలిస్టులను అడిగి తెలుసుకోవచ్చు. వాళ్లను వాట్సాప్, ఫోన్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుని నేరుగా మాట్లాడవచ్చు. ముఖ్యంగా నేర్చుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ట్రేడింగ్ పొజిషన్లు తీసుకోవడం, స్టాక్ ఎంపిక, రేపటి ట్రేడ్ ప్లాన్.. ఇలా మీకు సబ్జెక్ట్ గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎనలిస్టులు సందేహాలు తీరుస్తారు. సబ్జెక్ట్ పై మీకు కాన్పిఢెన్స్ వచ్చేంత వరకూ తమవంతు ప్రయత్నం చేస్తారు. మన ప్రీ ప్లాన్డ్ సెషన్స్ అన్నీ ముగిసిన తర్వాత ప్రతీ వారం ఒక డ్యూరింగ్ ది మార్కెట్ లైవ్ ట్రేడింగ్ సెషన్ (మధ్యాహ్నం 2-3.30 వరకూ) ఉంటుంది. అందులో మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడంతో పాటు ట్రేడ్ ఐడియాస్, పొజిషన్స్, సబ్జెక్ట్ సంబంధించి ఏ సందేహాలున్నా తీర్చుకోవచ్చు.

మీరేం చేయాలి ?
టెక్నికల్ ఎనాలిసిస్ అనేది ఓ నిరంతర అభ్యాస ప్రక్రియ. అంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త అంశమే. అందుకే మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రోజూ కనీసం గంటసేపైనా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో చేరిన వాళ్లకు ఎప్పటికప్పుడు హోం వర్క్ కూడా ఇస్తారు. దాన్ని పూర్తి చేసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తే.. ఎనలిస్టులు ప్రతీ ఒక్క ఛార్ట్‌నూ ఎనలైజ్ చేసి తప్పొప్పులు చెబ్తారు. పదిహేను క్లాసులు, 100 రోజుల మెంటార్షిప్‌ను మనం ఎంత అద్భుతంగా వినియోగించుకుంటే మనకు ట్రేడ్ పై అంత కాన్ఫిడెన్స్ వస్తుంది.
అందుకే ట్రేడింగ్ పై అమితాసక్తి, సమయం కేటాయించే అవకాశం మీకు ఉంటే మీరు ఈ ట్రేడింగ్ నేర్చుకోవడమనేది పెద్ద విషయమేమీ కాదు. ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ఇదే అతిపెద్ద మంత్రం.

క్లాసులు ఎన్ని రోజులు ?
మొత్తం 8 క్లాసుల థియరీ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత 4 క్లాసులు వివిధ సమయాల్లో డ్యూరింగ్ ది మార్కెట్ లైవ్ క్లాసులు ఉంటాయి. మొత్తం 12 క్లాసుల్లో మీరు Theory సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకుంటారు. క్లాసుకీ క్లాసుకీ మధ్య రెండు, మూడు రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు ఆ మధ్యలో ప్రాక్టీస్ చేసే సమయం లభిస్తుంది. ఆ తర్వాత మూడు నెలల పాటు ప్రతీవారం ఒక లైవ్‌ క్లాస్‌ ఉంటుంది. అలా మొత్తం 8+16 = 24 క్లాసులుంటాయి. ఇవే కాకుండా వాట్సాప్‌, టెలిగ్రాంలో మీరు ఎనలిస్టుతో ఎప్పుడు కావాలన్నా మాట్లాడొచ్చు, లేదా మీ డౌట్స్‌ క్లారిఫై చేసుకోవచ్చు. క్లాసెస్‌ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎనలిస్ట్‌తో ఎప్పుడైనా టచ్‌లో ఉండొచ్చు. మీకు ప్యాషన్‌ ఉంటే, మీకు లైఫ్‌టైమ్‌ సపోర్ట్‌ ఇచ్చేందుకు మెంటార్‌ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.

ఫీజ్ ఎంత ? Fees
ఈ మొత్తం కోర్సుకు రూ.20వేలు ఉంటుంది. ఇందులో ఎలాంటి డిస్కౌంట్లు, బేరసారాలు మాత్రం ఖచ్చితంగా లేవు. ఎందుకంటే మీరు ఈ కోర్సు సమయంలో ఎంత ప్రాక్టీస్ చేస్తారో, ఎనలిస్టులు కూడా అంతే స్థాయిలో శ్రద్ధ, సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాచ్‌లో 15 నుంచి 20 మందికి మించి విద్యార్థులు ఉండరు.

క్లాసులు ఎక్కడ జరుగుతాయ్ ? Online Classes only
ఇవి పూర్తిగా ఆన్ లైన్ క్లాసులు. సిస్కో వెబెక్స్ ద్వారా ఈ క్లాసులు జరుగుతాయి. మీకు క్లాసులకు సంబంధించిన లింకును పంపించడం జరుగుతుంది. మొబైల్‌లో లేదా ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లో కూడా చూసుకోవచ్చు. అయితే డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లో ఛార్ట్స్ చూడడం వీలుగా ఉంటుంది.

థియరీ క్లాసెస్ వారంలో మూడు రోజులు ఉంటాయి. (సోమవారం, బుధవారం, శుక్రవారం)
ఈ క్లాసెస్ తర్వాత ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ ట్రేడింగ్ సెషన్స్, ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి.
ఈ లోపు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్, ఫోన్ కాల్ ద్వారా నివృతి చేసుకోవచ్చు.

Live during the market classes will be updated in the group ( 2pm to 3:30pm .). Every Friday

Class Timings : Evening – 7 pm to 9 pm (Classes schedule will be updated in the separate whatsapp group)

Class Dates
09th June – 7pm to 9pm
11th June – 7pm to 9pm
13th June – 7pm to 9pm
16th June – 7pm to 9pm
18th June – 7pm to 9pm
20th June – 7pm to 9pm
23rd June – 7pm to 9pm
25th June – 7pm to 9pm

After These classes Live market sessions Every Friday 2PM to 3:30PM for next Three months.

1) Class 1 – 7pm to 9pm – Stock Market Basics, Charts, Candle Stick Basics

2) Class 2 -7:00PM to 9:00 PM Market Technical, Zones, Trends

3) Class 3 – Gap Analysis, Trading Styles

4) Class 4 – Volatility, Technical Indicators

5) Class 5 – Pivots, Technical Indicators

6) Class 6 – MTA, Money & Risk Management

7) Class 7 – 7:00PM to 9:00 PM F & O Basics

8) Class 8- 7:00PM to 9:00 PM F & O Basics

(ఈ క్లాసులకు సంబంధించిన తేదీల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు, మొదటి క్లాసులోనే ఖచ్చితమైన డేట్స్‌ను గ్రూపులో చెబ్తారు)
June27thవ తేదీ నుంచి డ్యూరింగ్ ది మార్కెట్ లైవ్ క్లాసులు ఉంటాయి. వీటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రత్యేక గ్రూప్ వాట్సాప్ గ్రూపులో వెల్లడించడం జరుగుతుంది.

రికార్డింగ్ సౌలభ్యం Recording of the Classes
ఇతర ఫిజికల్ క్లాసుల్లో అయితే ఒక్కసారి వింటే అయిపోతుంది. కానీ ఆ ఆన్ లైన్ క్లాసుల్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే.. అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా వీటిని మనం చూసుకునే వీలుంటుంది. అలానే ఎనలిస్టులు మీకు మేసేజ్ దూరంలో మాత్రమే ఉంటారు.

ఈ ప్రోగ్రాంలో కవర్ అయ్యే అంశాలు :
Basics & Beginner Level
Very Basics of the Stock Market | How the stock market works |
How to place orders ? How to keep stop loss orders ?
Orders placing in Futures and Options
Difference between fundamental analysis and technical analysis
What is Technical Analysis? Why is it important ?
How to Read Stock Charts?

Intermediary Level
Different types of Candlestick Patterns
Different Indicators and How to Use It?
Momentum Indicators to Analyze Trends
Trends strength, Entries, and Exits.
Analyzing markets through Price, Volume, Momentum, Volatility and Time

Advanced Level
Identification of Trend direction early
Identify best entries and exits
Basics of Futures & Options
Some weekly and monthly trade Strategies
Hedging Strategies (Advanced)

Journaling your trades and periodic reviewing to access your strengths and weakness

మెంటర్
M Rajendra Prasad (RP)

ఎం. రాజేంద్ర ప్రసాద్ (RP)
ఎం. కాం పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్, 1990 నుంచి స్టాక్ మార్కెట్లలో ఉన్నారు. మార్కెట్లపై ఉన్న ఆసక్తితో పాతికేళ్ల క్రితమే ముంబై సహా వివిధ ప్రాంతాలకు వెళ్లి అప్పట్లోనే ట్రైనింగ్ తీసుకుని టెక్నికల్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రేడింగ్ ట్రెండ్స్‌ను తెలుసుకున్నారు. ఆ తర్వాత తన కెరీర్‌లో హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఫ్లోర్ ట్రేడర్‌గా మొదలుపెట్టారు. అప్పటి నుంచి స్వంతంగా ట్రేడ్ చేస్తూ.. ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో రాజేంద్ర ప్రసాద్‌కు సుమారు 800మంది వరకూ శిష్యులు ఉన్నారు. 12ఏళ్ల నుంచి ట్రైనింగ్ క్లాసెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతో మందిని ట్రేడర్లుగా తీర్చిదిద్దారు. కేవలం ట్రైనింగ్ కాకుండా ట్రేడింగ్ కూడా చేయడం వల్ల ఫుల్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఈయన సొంతం.
సరళమైన తెలుగులో, చక్కగా అర్థమయ్యే విధంగా క్లాసులను విడమర్చి చెప్పడంలో మంచి అనుభవం ఈయనకు ఉంది. వివిధ ఎకాడమీల్లో విద్యార్థులు, అధికారులకు మార్కెట్లపై ఎన్నో సెషన్లను ఈయన నిర్వహించారు.

పేమెంట్ ఎలా ?
Option 1 –
Account Name:
PM Academy BANK AC NO.4021 5400 859
State Bank of India, Current Account
IFSC Code – SBIN0013032 (Rayadurg Branch, Manikonda Hyderabad)
Option 2 – GPAY/UPI 93910 02840 (Rajendra Prasad Maddineni) పేమెంట్ చేసిన తర్వాత 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి.

Thank you. Hurry up! ఇంతకాలం వెయిట్ చేసి, ప్రయోగాలు చేసి డబ్బులు పోగొట్టుకుంది చాలు. వెంటనే ఈ అద్భుత ప్రోగ్రాంలో చేరి, సక్సెస్‌ఫుల్ – ప్రొఫెషనల్‌ ట్రేడర్‌గా మారండి.