Profit Master Investors education meet in Hyderabad

Profit Master Investors education meet in Hyderabad
Date – July 21 (Sunday) from 9am onwards
Venue – Visweswaraya Bhavan, Institute of Engineers, Khairatabad, Hyd.

Fees Rs.2500/- (Incl. Breakfast, Lunch, Stationery)
Rs.1500/- only for Ladies. Group discounts also available.

ఆర్థిక ఏడాది సగ భాగమైపోయింది. ఆరు నెలలు గడిచిపోయాయి. ఎన్నికలు, కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, ఆర్బీఐ పాలసీలు.. ఇక విధానపరమైన విషయాలన్నీ ముగిసిపోయాయి. మార్కెట్లు ఇక తన సొంత కాళ్లపై తాను, ఎలాంటి ప్రభావాలకూ లోనుకాకుండా పటిష్టంగా నిలబడాల్సిన సమయం ఇది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మార్కెట్లు మంచి ఉత్సాహాన్నే కనబరచాయి. ఏడాది ప్రారంభంలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ హవా కొనసాగితే, తర్వాత రిలయన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ వంటి లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ కూడా మెల్లిగా తన సత్తాను చూపిస్తున్నాయి. ఓవరాల్‌గా మార్కెట్‌ బ్రెడ్త్‌ పాజిటివ్‌గానే ఉంది. కానీ ఎప్పటికప్పుడు ప్రాఫిట్‌ బుక్‌ కూడా చేసుకోవాల్సిన సందర్భాలు అనేకం ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఎగ్జిట్‌ పోల్స్‌ టైమ్‌లో మార్కెట్లు రిటైల్‌ ఇన్వెస్టర్లను కకావికలం చేసేశాయి. ఆ తర్వాత రికవర్‌ అయినప్పటికీ ఆ టైంలో జనాలు పడిన ఒత్తిడి మామూలుగా లేదు.
ఇక బడ్జెట్‌ కూడా దగ్గరికి వచ్చేసింది. వాస్తవానికి బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వాలు గత కొన్నేళ్ల నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బడ్జెట్‌ అనేది ఇప్పుడు కేవలం ఓ ఆస్తిఅప్పుల చిట్టాపద్దుల ప్రెజెంటేషన్‌ మాదిరి మిగిలిపోయింది. బడ్జెట్‌ రియాక్టివిటీ మార్కెట్లపై ఇప్పుడు పెద్దగా ఉండడం లేదు. బయ్‌ బిఫోర్‌ న్యూస్‌, సెల్‌ ఆన్‌ న్యూస్‌ అన్నట్టుగా ఏదైనా పెద్ద ఈవెంట్‌కు ముందే మనం జాగ్రత్తపడాల్సిన సమయం ఇది.

ఈ సారి యూఎస్‌లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి ప్రభావం మన మార్కెట్లపై కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థికంగా మనం పటిష్ట స్థాయికి చేరుకుంటున్నప్పటికీ ప్రభుత్వానికి ఈ సారి పెద్దగా మెజార్టీ లేదు. ప్రతిపక్షాల గొంతు కూడా పెరిగింది. అందుకే సంస్కరణల విషయంలో కేంద్రం కొద్దిగా ఆలోచించి అడుగులు వేయాల్సిన స్థితి ఉంది.

వాస్తవానికి మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్తే. ఏ సందర్భానికి ఆ సందర్భం అప్పటి వరకూ ఉన్న పరిస్థితులను మారుస్తుంది. అయితే స్టాక్స్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌ మార్చుకోవాల్సిన పరిస్థితి లేకపోయినప్పటికీ లేటెస్ట్‌ ట్రెండ్‌ను మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉండాలి. ట్రెండింగ్‌ సెక్టార్స్‌ ఏవి, అందులో బెస్ట్‌ పర్ఫార్మర్స్‌ ఏవి, ఎగ్జిట్‌ వ్యూహాలేంటి, ట్రాప్స్‌లో ఇరుక్కోకుండా ఎలా బయటపడాలి వంటి అంశాలన్నీ కూడా మనం నిత్యం నేర్చుకుంటూ ఉండాలి. వీటిపై అవగాహన కల్పించేందుకే ప్రాఫిట్‌ మాస్టర్‌ తరచూ ఇన్వెస్టర్స్‌ ఎడ్యుకేషన్‌ మీట‌ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సారి హైదరాబాద్‌ వేదికగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. లేటెస్ట్‌ మార్కెట్‌ స్థితిగతులతో పాటు అద్భుతమైన పొటెన్షియల్‌ ఉన్న బిజినెస్‌లను ఎలా ముందుస్తుగా ఐడెంటిఫై చేయాలి అనే వినూత్న కాన్సెప్ట్‌ మీరు నేర్చుకుంటారు. ఎక్స్‌పీరియన్షియల్‌ లెర్నింగ్‌.. అంటే మార్కెట్‌లో అనుభవం ఉన్న నిపుణుల అనుభవం నుంచి పుట్టిన పాఠాలనే మీరూ తెలుసుకుంటారు. కేవలం పీఈ, బుక్‌ వేల్యూ, ఈపీఎస్‌, క్యాష్‌ ఫ్లోస్‌ వంటి బుకిష్‌ నాలెడ్జ్‌కు భిన్నంగా బిజినెస్లను ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకంటారు.

గుడ్‌ బిజినెస్‌, బ్యాడ్‌ బిజినెస్‌, ఎమర్జింగ్‌ బిజినెస్‌, గ్రోత్‌ స్కోప్‌, ఆపర్చునిటీస్‌ వంటి అంశాలను మార్కెట్‌తో మిళితం చేసి నేర్చుకుంటారు. ఏదో నాలుగు స్టాక్స్‌ కొంటే చాలనుకునే రోజులు పోయాయి. రాబోయే రోజులలో మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ విపరీతంగా పెరగబోతున్నాయి. మనం ఊహించనంత అద్భుతాలు వివిధ రంగాల్లో రాబోతున్నాయి. వాటన్నింటినీ మనం ముందు తెలుసుకోగలిగితేనే, ఇక్కడ నిలబడగలం, మనుగడ సాధించగలం.

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ చౌరస్తాలోని విశ్వేశ్వరయ్య భవన్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌)లో ఈ సారి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మెట్రో స్టేషన్‌ను ఆనుకుని, అందరికీ అనువైన లొకేషన్‌లో ఈవెంట్‌ జరగబోతోంది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారు కాబట్టి, వాళ్లకు ఇబ్బంది లేకుండా ఈ సారి బ్రేక్‌ఫాస్ట్‌ కూడా అరేంజ్‌ చేస్తున్నాం. ఖర్చులు పెరిగినా కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం మీకు విద్యాజ్ఞానాన్ని అందించాలనే పూర్తి సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈవెంట్‌ ఇది. మార్కెట్‌ మాయాజాలంలో మీరు డబ్బులు పోగొట్టుకోకుండా, మీరు కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి డబ్బును కాపాడుకునేలా మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుంటారనేది ఏకైక లక్ష్యం మాది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎనలిస్ట్‌, తెలుగులో అత్యధిక లైవ్‌ టీవీ షోస్‌ నిర్వహించిన మెంటార్‌ శ్రీ. ఏ. శేషు గారితో పాటు ట్రేడింగ్‌ కమ్యూనిటీ మెచ్చే ఎనలిస్ట్‌, మెంటార్‌ శ్రీ ఎం. రాజేంద్ర ప్రసాద్‌ గారు కూడా హాజరవుతారు. వ్యాఖ్యాతగా ప్రముఖ బిజినెస్‌ జర్నలిస్ట్‌ నాగేంద్ర సాయి గారు వ్యవహరిస్తారు.
మీ అభిమాన మెంటార్లను ప్రత్యక్షంగా కలిసి వాళ్లతో ముచ్చటిచ్చేందుకు, మీ సహచర ఇన్వెస్టర్‌ కమ్యూనిటీతో నెట్వర్కింగ్‌ చేసుకునేందుకు కూడా ఇదో అద్భుత అవకాశంగా భావించండి. ఏడాదిలో ఒక్కసారి ఇలాంటి ఈవెంట్లకు హాజరై, ఈ ఇయర్ ప్లానింగ్‌ అంతా చేసుకునే గైడెన్స్‌ పొందండి.

తేదీ – జూలై 21 (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ
ఫీజు రూ.2500/- (బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, టీ ఏర్పాట్లతో కలిపి)
మహిళలకు రూ.1500 మాత్రమే
వేదిక – విశ్వేశ్వరయ్య భవన్, ఇంజనీర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ పక్కన, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌.

బ్యాంక్‌ డీటైల్స్‌ –
ఈ ఒక్క రోజు కార్యక్రమానికి ఫీజ్ రూ.2500. ఇందులో మధ్యాహ్నం లంచ్‌తో పాటు ఉదయం – సాయంత్రం టీ, బిస్కెట్స్ ఇస్తారు. వీటితో పాటు స్టేషనరీ కూడా ఉంటుంది. మహిళలకు ఈ ఫీజులో Rs.1000 రాయితీ లభిస్తోంది. అంటే వాళ్లకు రూ.1500 మాత్రమే ఫీజ్. అయితే ఇది ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది.
5 కంటే ఎక్కువ మంది ఉన్న బ్యాచ్, అంతా కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకుంటే 10శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది కూడా ఆన్‌లైన్‌లో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి.
విపరీతంగా పెరిగిన హోటల్, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటీ, పవర్‌ ఖర్చుల నేపధ్యంలో ఈ నామమాత్రపు ఫీజుపై డిస్కౌంట్లు అడగొద్దని విజ్ఞప్తి. పూర్తిగా మీకు విజ్ఞానాన్ని పంచే ఏకైక ఉద్దేశంతో ఏర్పాటు చేసే కార్యక్రమమే కానీ విపరీత లాభాపేక్షతో చేసే ప్రోగ్రామ్ మాత్రం కాదని మరోసారి గుర్తు చేస్తున్నాం.

ఫీజ్ ఎలా చెల్లించాలి ?
ఫోన్‌ పే, గూగుల్‌ పే నెంబర్‌ – 8247596166

బ్యాంక్‌ డీటైల్స్‌ –
Account Name: PM ONLINE EDUCATION
A/C NO: 5020 0062 3682 53
Type – Current Account
Bank – HDFC Bank, Alkapur township, Hyderabad
IFSC Code – HDFC0009425
Google Pay/PhonePay 82475 96166 (GPay – K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మా టీమ్‌ పంపే గూగుల్‌ ఫార్మ్‌ ఫిల్‌ చేసి మీ రిజిస్ట్రేషన్‌ కన్ఫర్మేషన్‌ పొందండి.