బడ్జెట్‌ తర్వాత ఈ రంగాలపై దృష్టిపెట్టండి! గెలుపు గుర్రాలివి

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ డివిడెండ్‌ రూపంలో ఇచ్చిన భారీ నగదును కేంద్రం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఫిస్కల్‌ డెఫిసిట్‌ (ద్రవ్య లోటు)ను తగ్గించేందుకు ఖర్చు చేయడం నిజంగా ప్రశంసించాల్సిన అంశం. దీంతో గతేడాదితో పోలిస్తే సుమారు 0.7 శాతం ఇది తగ్గుతుందని. సంకీర్ణ ప్రభుత్వంలో సమర్పించిన తొలి బడ్జెట్‌లో ఇంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడం ఖచ్చితంగా ప్రశంసార్హమైనది. ముఖ్యంగా గ్రామీణ భారతానికి అధిక ప్రాధాన్యతను ఈ సారి కేంద్రం ఇచ్చింది. అదే సమయంలో క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ కోసం రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం కూడా మంచి నిర్ణయం. మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగంపై అధికంగా దృష్టిపెడ్తూనే, ఉద్యోగాల కల్పన విషయంలో కూడా కేంద్రం చొరవ తీసుకుంది. కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అదే ఎంప్లాయ్డ్‌ లింక్‌ ఇన్సెన్టివ్‌ స్కీమ్‌. దీంతో ప్రభుత్వ దృష్టి ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెన్టివ్‌ స్కీమ్‌ నుంచి ఎంప్లాయ్డ్‌ స్కీమ్‌వైపు మళ్లినట్టుగా అనిపిస్తోంది. 

ఎకనమిక్‌ సర్వేలో ప్రధానంగా ప్రస్తావించిన రెండు ముఖ్యమైన పాయింట్లను మీ కోసం ఇక్కడ ప్రత్యేకంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. 

2036 నాటికి భారత్‌ ప్రతీ ఏటా సుమారు 80 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది.

100 మందికి మించి కార్మికులు ఉన్న ఫ్యాక్టరీల సంఖ్య 13 శాతం పెరిగింది. దీంతో ఈ రంగం కూడా మెల్లిగా వ్యవస్థీకత (ఆర్గనైజ్డ్‌)గా మారుతోంది అనేందుకు సంకేతం. 

ప్రభుత్వం తాజాగా ఎంప్లాయిడ్ లింక్‌ ఇన్సెన్టివ్‌ స్కీమ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడానికి కారణం ఉద్యోగాల కల్పన. వ్యవస్థీకృత రంగంలో ఎక్కువ ఉద్యోగాలను తీసుకురావడానికి కసరత్తు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దీంతో రాబోయే కొంత కాలానికి ఆర్థిక వ్యవస్థపై అద్భుతమైన ప్రభావం కనపడబోతోంది.

మొదటి క్వార్టర్‌లో కేంద్రం ఖర్చుల విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించింది. ముఖ్యంగా ఎన్నికలు, ఫిబ్రవరి 2025లో మళ్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండడం ప్రధానాంశాలు. అందుకే ఖర్చుల విషయంలో కొద్దిగా ఆలోచించారు. కేవలం ఆరు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ విషయమై దృష్టిపెట్టారు. ఈ తక్కువ సమయంలో ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకుని ద్రవ్య లోటును మరింతగా తగ్గించుకోవాలని చూస్తోంది. దీని వల్ల ఇన్‌ఫ్లేషన్‌ కూడా తగ్గుతుంది. పరోక్షంగా వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆర్బీఐకి కూడా కంఫర్ట్‌ ఉంటుంది. 

ఏ రంగాలపై దృష్టిపెట్టాలి

బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్రం కొద్దిగా కొన్ని ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ప్రకటించింది. స్థానికంగా ఉన్న ఈపీసీ ప్లేయర్స్‌కు ఇది పాజిటివ్‌ న్యూస్‌. కొత్తగా పవర్‌ ప్లాంట్స్‌ కూడా ప్రకటించారు. ఇది కూడా పాజిటివ్‌ న్యూస్‌. రైల్వే విషయంలో సుమారు రూ.2.7 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. మధ్యంతర బడ్జెట్‌తో సరిసమానంగానే ఇది ఉంది. అయితే ప్రొక్యూర్మెంట్‌ టార్గెట్ల విషయంలో మాత్రం గణనీయంగా పెంచారు. వాగన్ల విషయంలో 46 శాతం, ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్స్‌ విషయంలో 25 శాతం మేర వృద్ధి ఉంది. రోలింగ్‌ స్టాక్‌ కోసం అధికంగా కేటాయించిన డెడికేటెడ్‌ ఫ్రయిట్‌ కారిడార్‌ కూడా డిమాండ్‌ మరింతగా పెంచుతుంది. క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల్లో ఉన్న వాళ్లకు ఇది చాలా పెద్ద న్యూస్‌ అవుతుంది. 

గత బడ్జెట్‌తో పోలిస్తే హైవేస్‌ రంగానికి స్వల్ప కేటాయింపులు పెంచారు. 

మధ్యంతర బడ్జెట్‌తో పోలిస్తే పెద్దగా మార్పులుండవ్‌. ఎన్‌బిఎస్‌, యూరియాతో పోలిస్తే సబ్సిడీల విషయంలో పెద్దగా మార్పుల్లేవ్‌. 109 అధిక కాపునిచ్చే పంటలు (హై ఈల్డింగ్‌ క్రాప్స్‌)పై అధిక దృష్టిపెట్టారు. రైతుల ఆదాయంపై మెల్లిగా ఇది పాజిటివ్‌ ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యవసాయ పనిముట్ల విషయంలో బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించారు. ఎగుమతుల రంగంపై కూడా కొద్దిగా పాజిటివ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తుంది. 

నూతన ఉద్యోగాల కల్పనతో పాటు, గ్రామీణ ప్రాంతానికి నిధులను ఎక్కువగా కేటాయించడం వంటివన్నీ కన్స్యూమర్‌ రంగంపై కొద్దిగా ప్రభావాన్ని చూపించే అంశాలే. 

బంగారంపై ఇంపోర్ట్‌ డ్యూటీ తగ్గింపు వల్ల రిటైలర్లకు గుడ్‌ న్యూస్‌. అయితే అప్పటికే ఉన్న ఇన్వెంటరీ ఎఫెక్ట్‌ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే సేల్స్‌ గణనీయంగా పెరగడం వల్ల ఆ ప్రభావం జ్యూవెల్రీ షాపులు తట్టుకోగలవు.

వీటికి తోడు శ్లాబుల్లో మార్పులు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు వల్ల జనాల చేతుల్లోకి డబ్బులు వెళ్తాయి. ఇది పరోక్షంగా కన్స్యూమర్‌ విభాగంలోకి వెళ్తుంది. కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. 

వీటితో పాటు ఫార్మా, ఐస్ రంగాల స్టాక్స్‌ను కూడా మనం మరచిపోవద్దు. ప్రత్యక్షంగా బడ్జెట్‌తో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ వివిధ కారణాలు వీటిపై ప్రభావం చూపిస్తాయి. చైనాలో వడ్డీ రేట్ల కోత నేపధ్యంలో రూపాయి పతనమవుతోంది. ఇది ఈ రెండు రంగాలకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది. 

రచయిత –

మోహిత్‌ ఖన్నా, పునర్థ ఒన్‌ స్ట్రాటజీ ఫండ్‌ మేనేజర్‌