హాలిడే సందర్భంగా ఈ స్టాక్స్‌లో యాక్టివిటీ మిస్ అయి ఉంటారు.. ఓ సారి చూడండి
సింగపూర్ ఎక్స్ఛేంజీలో నిఫ్టీ ఫ్యూచర్స్ 60 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దీంతో మన మార్కెట్లు కూడా నష్టాల బాటలో ప్రారంభమయ్యే సూచనలున్నాయి. నిన్న మన మార్కెట్లు సెలవు తీసుకున్న నేపధ్యంలో కొద్దిగా అడ్జస్టుమెంట్లు జరగాల్సి ఉంది.
ఈ రోజు ట్రేడ్ ముందు చూడాల్సిన అంశాలు –
రిలయన్స్ ఇండస్ట్రీస్ – ఢిల్లీకి చెందిన క్యాంపా కోలా సంస్థను రూ.22 కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్. దీపావళికి సరికొత్తగా బ్రాండును మార్కెట్లలోకి తీసుకువచ్చే యోచనలో రిలయన్స్ రిటైల్.
ఆయిల్ కంపెనీలు – ఆయిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం.
ఎస్బీఐ – అనామిక కండక్టర్స్ రూ.102 కోట్ల ఎన్.పి.ఏ.ను విక్రయించబోతున్న బ్యాంక్. ఈ బిడ్డింగ్ ద్వారా ఆసక్తికి ఆహ్వానం.
ఎన్టీపీసీ – ఎన్ సి డిల జారీ ద్వారా రూ.12వేల కోట్ల సమీకరణకు షేర్ హోల్డర్ల నుంచి అనుమతి పొందిన సంస్థ.
టాటా మోటార్స్ – 2006లో మార్కోపోలోతో కలిసి ఏర్పాటు చేసిన బస్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్ వెంచర్లో పూర్తి స్థాయి వాటా తీసుకున్న టాటా మోటార్స్.
వోడాఫోన్ ఐడియా – సంస్థ సీఎఫ్ఓ అక్షయ మూంద్రాను సీఈఓగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతి.
బయోకాన్ – బెంగళూరులోని రెండు ప్లాంట్లు, మలేషియాలో ఉన్న ఒక ప్లాంటుకు యూఎస్ ఎఫ్.డి.ఏ నుంచి ఫార్మ్ 483 జారీ. 11 లోపాలను గుర్తించిన యూఎస్ ఎఫ్ డి ఏ అధికారులు.
హావెల్స్ ఇండియా – రాజస్థాన్ ప్లాంటులో వాషింగ్ మెషీన్ ఉత్పత్తి పెంపునకు కసరత్తు. విస్తరణకు రూ.130 కోట్లు.
జీ ఎంటర్టైన్మెంట్ – డిస్నీ స్టార్‌తో కలిసి వ్యూహాత్మక లైసెన్సింగ్ అగ్రిమెంట్. కాంపిటీషన్ కమిషన్ దృష్టిలో పడ్డ డీల్.
స్పైస్ జెట్ – రూ.789 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన సంస్థ. సీఎఫ్ఓ రాజీనామా. రెండు నెలలుగా ఉద్యోగుల జీతాలకు కటకట.
నజారా టెక్నాలజీస్ – రూ.82 కోట్లతో యూఎస్‌కు చెందిన గేమింగ్, స్పోర్ట్స్ సంస్థ వైల్డ్ వర్క్స్ కొనుగోలు.