బోనస్‌ షేర్లు ఇవ్వబోతున్న రిలయన్స్‌ ?

reliance industries to consider bonus shares

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోనస్‌ షేర్లను జారీ చేసే యోచనలో ఉందని సమాచారం. ఒక్క షేర్‌కు మరొక షేర్‌ బోనస్‌గా ఇచ్చేందుకు చూస్తోందని సమాచారం. సెప్టెంబర్‌ 5వ తేదీన ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడొచ్చని తెలుస్తోంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఆగస్ట్ 29న (ఈ రోజు) జరగబోతోంది. ఇందులో ఇలాంటి భారీ ప్రకటనలు ఉండొచ్చని సమాచారం.
ముఖ్యంగా కంపెనీ విలువను మరింతగా పెంచి షేర్‌ హోల్డర్లకు లాభాలను పంచే అంశంపై సంస్థ యాజమాన్యం పరిశీలిస్తోందని స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. 

ఇందులో భాగంగా జియో కంపెనీ లిస్టింగ్‌పై ఏదైనా ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఈ మధ్యే రూ.5వేల కోట్లతో అత్యంత ఘనంగా ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం చేసిన ముఖేష్‌ అంబానీ, ఇప్పుడు షేర్‌ హోల్డర్లలో కూడా ఆనందాన్ని పంచవచ్చని అనుకుంటున్నారు. 

ఈ వార్తల నేపధ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌ రెండున్నర శాతం వరకూ పెరిగింది. స్టార్‌ ఇప్పుడు రూ.3075 దగ్గర ట్రేడవుతోంది. స్టాక్‌ ఏడాదిలో 27 శాతం లాభాలను పంచింది.