స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 80వేల పాయింట్ల మార్కును మొదటిసారి క్రాస్ చేసింది. నిత్యం కొత్త రికార్డులతో మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మంచి పాజిటివ్ సంకేతాలు రావడం కారణమైతే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్‌లో భారీ లాభాలు కూడా బుల్ దూకుడుకు మరో పాజిటివ్ పాయింట్.
HDFC Bankలోకి ఎస్ఎంసిఐ ఇండెక్స్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు వచ్చి పడే సంకేతాలున్నాయనే వార్తలు ఈ రోజు ఇంట్రాడేలో ఈ స్టాక్‌ను నాలుగు శాతం వరకూ పైకి తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా తోడు రావడంతో బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు పెరిగింది.
సెన్సెక్స్ మొదటిసారిగా ఐదు వేల పాయింట్లను అతి తక్కువ ట్రేడింగ్ డేస్‌లో అధిగమించింది. 75వేల పాయింట్ల నుంచి 80వేల పాయింట్ల మార్కును అతి తక్కువగా 57 రోజుల్లోనే చేరుకోవడం మరొక పాజిటివ్ అంశం. మూడేళ్లా క్రితం 55వేల నుంచి 60 వేల పాయింట్లను చేరుకోవడానికి సెన్సెక్స్‌కు 28 రోజుల గడువు పట్టింది. మళ్లీ ఇప్పుడే ఆ వేగంతో మార్కెట్లు పరుగులు తీశాయి.
ఎంఎంటిసి 10 శాతం, క్యాస్ట్రోల్ ఇండియా 7 శాతం, కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 6.5 శాతం, హడ్కో, గుజరాత్ పిపావవ్ ఐదున్నర శాతం వరకూ పెరిగాయి.
యాంబర్ ఎంటర్‌ప్రైజెస్, భారత్ డైనమిక్స్, బయోకాన్, క్యామ్స్, క్యాస్ట్రోల్ ఇండియా స్టాక్స్ 52వీక్ హై జాబితాలో చేరాయి.
స్టెర్లింగ్, విల్సన్ స్టాక్స్‌లో ఓన్లీ బయర్స్ మాత్రమే ఉన్నారు.